వేటూరి గారి అభిమానుల కి ప్రత్యేకం

Sunday 11 November 2012

నా దీపావళి అనుభవాలు

 ముందుగా మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు !
పప్పు సర్ కి,సౌమ్య గారికి ,సురేష్ గారికి ,శశి గారికి,చంద్రకళ గారికి ,నరేష్ గారికి ,కొండల రావు గారికి అందరు పెద్దలకి (ఎవరినైనా మర్చిపోతే క్షమించండి ).....
చాణక్య కి ఎలాగు పండగలంటే పెద్ద గా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి వదిలేస్తునా .
దీపావళి పండగ ఎందుకు చేసుకుంటారో మీకు నేను చెప్తే అది వెటకారం గా ఉంటుంది .
రావణుడిని చంపడం వల్లో ,లేక నరకాసుర వధ వల్లో మనకి ఒక పండగ వచ్చి చేరింది  ...
నా వరకు నా చిన్నతనం లో దీపావళి అంటే మహా సరదా ,చుట్టూ ఉండే స్నేహితుల తో బాగా ఎంజాయ్ చేసేవాడిని
అప్పుడు సరదాలే వేరు ,చిన్న చిన్న తుపాకుల తో ఆడుకునేవాళ్ళం ,,
వయసు పెరిగే కొద్ది దీపావళి అంటే ఇంట్రెస్ట్ తగ్గిపోయింది .ఏడో తరగతి లో ఐతే ఒక చిన్న నిప్పు రవ్వ కుడి కంట్లో పడింది .ఒక రెండ్రోజుల పాటు కళ్ళు బాగా ఎర్రపడిపోయాయి .ఆ తర్వాత నాకు భయం కూడా ఒక కారణం అయ్యింది.
అలా పదో తరగతికి వచ్చేసరికి పూర్తి గా ఇంట్రెస్ట్ పోయింది 
ఇంకా ఇంటర్ అనే నరకం లో ఐతే నారాయణ కాలేజీ వాడు రాత్రి తొమ్మిది వరక కాలేజీ పెట్టడం వల్ల దీపావళి జరుపుకునే భాగ్యం లేదు అప్పుడు ,
అయినా మనసులని చీకట్లో పెట్టుకుని బయటకు వెలిగే ముఖాలు పెట్టుకునే దీపావళి జరుపుకోక్కర్లేదు ..
ఇప్పటికి నాకు దీపావళి అంటే ఎందుకు ఆసక్తి అంటే మా అమ్మ చేసే స్వీట్స్ కోసమే .............
మరోసారి మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు ................