వేటూరి గారి అభిమానుల కి ప్రత్యేకం

Friday 21 September 2012


పాపం రిక్షావాడు
"చీ రిక్షావాడు",అని ఒకసారి అన్నాను
"ఏంటి నువ్వు సంస్కారహినుడివా?రిక్షా అతను అని పలుకు అతను నీ కన్నా ఎందులోనూ తక్కువ కాదు "అని నా మనసు నన్ను మందలించింది ,అది మందలింపు మాత్రమే కాదు హెచ్చరిక కూడా ఏమో ? నేను ఇవాళ (21 sep ) విజయ
నగరం లో మార్కెట్ కి వెళ్ళాను ,మా అమ్మ తో ,అసలే బాగా రద్దీగా ఉంటుంది ,వినాయక నవరాత్రులు,గురజాడ వారి 150 జయంతుత్సవాలు ,ఇంకొంచెం ఎక్కువ మంది జనం ఎక్కువ ఉన్నారు ,కొనడం అంట అయిపొయింది ,ఇంటికి రిక్షాలో వెళ్లలనుకున్నాను,అమ్మ కూడా సరే అంది,
ఒక రిక్షా అతను వచ్చి అమ్మ ఎక్కడికి అన్నాడు అమ్మ PSR COLONY అన్నది ,ఇరువై రూపాయులు అడిగాడు,15 ఇస్తాం,కాస్త కటువుగానే చెప్పాం!
 
 
 

అతను రాను అని చెప్పాడు ,మల్లి ఏమైందో పిలిచి రండమ్మ అన్నాడు ,మేము రిక్షా ఎక్కాం,అతను ఆ బిజీ మార్కెట్ లో మమ్మలిని లాగలేక అవస్తలు పడుతున్నాడు ,నేను దిగిదా అని అడిగాను ,వద్దు బాబు అని సున్నితం గ చెప్పాడు
రొప్పుతూ ఆయాసపడుతూ మమ్మలిని లాగి రిక్షా తొక్కడం మొదలుపెట్టాడు,అతన్ని చుస్తే నాకు జాలి వేసింది ,ఈ లోపు ఎవడో కార్ వాడు one వే లో కూడా అడ్డం గా వచ్చాడు,మాకు దశ ఇచ్చినంత పని చేసాడు ,నాకు వాడి మీద విపరీతమైన కోపం వచ్చింది ,
ఇంటికి మమ్మలిని జాగ్రత్త గా తీసుకొచ్చాడు ,కానీ అతని ఒంట్లో శక్తి మాత్రం పూర్తి గా పోయింది ,
అతను డబ్బులు కోసం మా వయిపు చూసాడు అమ్మ నాకు ఇరువై ఇచ్చి ,మొత్తం ఇచ్చేయమంది,నాకు చాలా ఆశ్చర్యమేసింది ,నేను డబ్బులు చేతిలో పెట్టగానే అతని ముఖంలో కాస్త ఆనందం కనిపించింది ,కళ్ళు కాస్త చేమర్చినట్టు కనిపించాయి,నా వయిఔ నవ్వుతు చూసాడు ,వస్తాను బాబు అని చెప్పాడు,
ఈ రోజు ఈ క్షణం లో అతని నవ్వు ని ,ఆనందాన్ని నేను మర్చిపోలేను ,మర్చిపోను కూడా!
కేవలం 5 రూపాయల కోసం అతనికి అంత ఎక్కువ అనిపించాయి!
అయిన 5 రూపాయిలు ఎప్పుడు ఎక్కువే మరి ? నేను సంపాదించడం లేదు కదా ,5 రూపాయిలు నాకు తక్కువ గానే కనిపిస్తుంది ?
— in Vizianagaram