వేటూరి గారి అభిమానుల కి ప్రత్యేకం

Sunday 11 November 2012

నా దీపావళి అనుభవాలు

 ముందుగా మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు !
పప్పు సర్ కి,సౌమ్య గారికి ,సురేష్ గారికి ,శశి గారికి,చంద్రకళ గారికి ,నరేష్ గారికి ,కొండల రావు గారికి అందరు పెద్దలకి (ఎవరినైనా మర్చిపోతే క్షమించండి ).....
చాణక్య కి ఎలాగు పండగలంటే పెద్ద గా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి వదిలేస్తునా .
దీపావళి పండగ ఎందుకు చేసుకుంటారో మీకు నేను చెప్తే అది వెటకారం గా ఉంటుంది .
రావణుడిని చంపడం వల్లో ,లేక నరకాసుర వధ వల్లో మనకి ఒక పండగ వచ్చి చేరింది  ...
నా వరకు నా చిన్నతనం లో దీపావళి అంటే మహా సరదా ,చుట్టూ ఉండే స్నేహితుల తో బాగా ఎంజాయ్ చేసేవాడిని
అప్పుడు సరదాలే వేరు ,చిన్న చిన్న తుపాకుల తో ఆడుకునేవాళ్ళం ,,
వయసు పెరిగే కొద్ది దీపావళి అంటే ఇంట్రెస్ట్ తగ్గిపోయింది .ఏడో తరగతి లో ఐతే ఒక చిన్న నిప్పు రవ్వ కుడి కంట్లో పడింది .ఒక రెండ్రోజుల పాటు కళ్ళు బాగా ఎర్రపడిపోయాయి .ఆ తర్వాత నాకు భయం కూడా ఒక కారణం అయ్యింది.
అలా పదో తరగతికి వచ్చేసరికి పూర్తి గా ఇంట్రెస్ట్ పోయింది 
ఇంకా ఇంటర్ అనే నరకం లో ఐతే నారాయణ కాలేజీ వాడు రాత్రి తొమ్మిది వరక కాలేజీ పెట్టడం వల్ల దీపావళి జరుపుకునే భాగ్యం లేదు అప్పుడు ,
అయినా మనసులని చీకట్లో పెట్టుకుని బయటకు వెలిగే ముఖాలు పెట్టుకునే దీపావళి జరుపుకోక్కర్లేదు ..
ఇప్పటికి నాకు దీపావళి అంటే ఎందుకు ఆసక్తి అంటే మా అమ్మ చేసే స్వీట్స్ కోసమే .............
మరోసారి మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు ................


Friday 21 September 2012


పాపం రిక్షావాడు
"చీ రిక్షావాడు",అని ఒకసారి అన్నాను
"ఏంటి నువ్వు సంస్కారహినుడివా?రిక్షా అతను అని పలుకు అతను నీ కన్నా ఎందులోనూ తక్కువ కాదు "అని నా మనసు నన్ను మందలించింది ,అది మందలింపు మాత్రమే కాదు హెచ్చరిక కూడా ఏమో ? నేను ఇవాళ (21 sep ) విజయ
నగరం లో మార్కెట్ కి వెళ్ళాను ,మా అమ్మ తో ,అసలే బాగా రద్దీగా ఉంటుంది ,వినాయక నవరాత్రులు,గురజాడ వారి 150 జయంతుత్సవాలు ,ఇంకొంచెం ఎక్కువ మంది జనం ఎక్కువ ఉన్నారు ,కొనడం అంట అయిపొయింది ,ఇంటికి రిక్షాలో వెళ్లలనుకున్నాను,అమ్మ కూడా సరే అంది,
ఒక రిక్షా అతను వచ్చి అమ్మ ఎక్కడికి అన్నాడు అమ్మ PSR COLONY అన్నది ,ఇరువై రూపాయులు అడిగాడు,15 ఇస్తాం,కాస్త కటువుగానే చెప్పాం!
 
 
 

అతను రాను అని చెప్పాడు ,మల్లి ఏమైందో పిలిచి రండమ్మ అన్నాడు ,మేము రిక్షా ఎక్కాం,అతను ఆ బిజీ మార్కెట్ లో మమ్మలిని లాగలేక అవస్తలు పడుతున్నాడు ,నేను దిగిదా అని అడిగాను ,వద్దు బాబు అని సున్నితం గ చెప్పాడు
రొప్పుతూ ఆయాసపడుతూ మమ్మలిని లాగి రిక్షా తొక్కడం మొదలుపెట్టాడు,అతన్ని చుస్తే నాకు జాలి వేసింది ,ఈ లోపు ఎవడో కార్ వాడు one వే లో కూడా అడ్డం గా వచ్చాడు,మాకు దశ ఇచ్చినంత పని చేసాడు ,నాకు వాడి మీద విపరీతమైన కోపం వచ్చింది ,
ఇంటికి మమ్మలిని జాగ్రత్త గా తీసుకొచ్చాడు ,కానీ అతని ఒంట్లో శక్తి మాత్రం పూర్తి గా పోయింది ,
అతను డబ్బులు కోసం మా వయిపు చూసాడు అమ్మ నాకు ఇరువై ఇచ్చి ,మొత్తం ఇచ్చేయమంది,నాకు చాలా ఆశ్చర్యమేసింది ,నేను డబ్బులు చేతిలో పెట్టగానే అతని ముఖంలో కాస్త ఆనందం కనిపించింది ,కళ్ళు కాస్త చేమర్చినట్టు కనిపించాయి,నా వయిఔ నవ్వుతు చూసాడు ,వస్తాను బాబు అని చెప్పాడు,
ఈ రోజు ఈ క్షణం లో అతని నవ్వు ని ,ఆనందాన్ని నేను మర్చిపోలేను ,మర్చిపోను కూడా!
కేవలం 5 రూపాయల కోసం అతనికి అంత ఎక్కువ అనిపించాయి!
అయిన 5 రూపాయిలు ఎప్పుడు ఎక్కువే మరి ? నేను సంపాదించడం లేదు కదా ,5 రూపాయిలు నాకు తక్కువ గానే కనిపిస్తుంది ?
— in Vizianagaram

Thursday 23 August 2012

                        మాకు ఉంది బాల్యం 

ఏదో chanakya ,గారి బాల్యం చదివి వాడి బాల్యం లో నేను కూడా ఒక చిన్న పార్ట్ కాబట్టి మనం ఒక ఇన్సిడెంట్ రాద్దామని అనుకున్నాను ,ఇదిగో ఈ టపా మీ కోసమే చదివి నవ్వుతారో,ఎడుస్తారో మీరే డిసైడ్ చేసుకోండి.

నేను విజయానగరం వాసిని,కనుక ఉత్తరాంధ్ర యాస
  తప్పదు

నేను 03 09 1994 న సింహాచలం లో పుట్టాను,అప్పన సామీ కొండ దగ్గర పుట్టాను కదాని నాకు ఆ పేరే పెట్టారు,నాకు 4  

ఏళ్ళు వచ్చేవరక ఒక మౌన ముని ల ఉండేవాడిని అట ,ఎవరిని కనీసం కరవనైన కరవలేదు మరి,ఇక నాలుగు ఏళ్ళు వచ్చేసరికి 

            

మా అగ్రజుల వారు స్కూల్ కి వెళ్లి సరదాగా వచ్చేవారు
,పైగా నాకు ఊరంతా తిరగాలని ఉండేది కనక గొడవ చేసి స్కూల్ లో జాయిన్ అయ్యాను .నేను మన్సాస్ లో జాయిన్ అయ్యేసరికి అక్కడ పిల్లల సంఖ్యా 2400 పై మాటే,నేను స్కూల్ వదిలేసరికి నా పాద స్పర్సకి 650 కి పడిపాయింది,

 

నాకు బాగా గుర్తు నేను LKG  లో చాల పూర్ స్టూడెంట్ నే ,అలా 2వ తరగతికి క్లాసు లో 1st rank వచ్చింది ,(మీరు అలా భయపడ కూడదు మరి)

తర్వాత ఒకసారి మా స్కూల్ స్టేజి మీద శ్రీహర్ష అని పిలవబోయి ,శిరీష  అని పిలిచారు .నాకు మా క్లాసు టీచర్ మీద ఒళ్ళుమండి అతన్ని
ఒరేయ్ అన్నాను,నాకు గూబ గుయ్యిమనేల కొట్టాడు,అది నాకు తగిలిన ఫస్ట్ దెబ్బ,